సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కడప నుంచి విమాన సర్వీసులు పునరద్దరించాలని సీఎం జగన్‌ కు రాసిన లేఖలో కోరారు చంద్రబాబు నాయుడు. కడప నుంచి విమాన సర్వీసులు నిలిపేయడం తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు.

chandrababu naidu ys jagan

గతం లో ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని టైర్-, టైర్-3 నగరాలకూ విమానాలు నడిపామని గుర్తు చేశారు. కడప ఇతర ప్రాంతాల సామాన్య ప్రయాణికులు.. పారిశ్రామిక వేత్తల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని సర్వీసులు పునరద్దరించాలని సీఎం జగన్‌ ను కోరారు చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడు రాసిన ఈ లేఖ పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా… కొన్ని అనివార్య కారణాల కారణాంగా… కడప నుంచి విమాన సర్వీసులను ఏపీ సర్కార్‌ నిలిపి వేసిన సంగతి తెల్సిందే.