పింఛన్‌ పొందే వారికి కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త

తెలంగాణ సర్కార్‌ పించన్‌ దరఖాస్తులపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ఆసరా వృద్దాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శ సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మీ సేవ కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు సోమేష్‌ కుమార్‌.

వృద్దాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించినా అర్హులు చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని అసెంబ్లీ సమావేశాల సందర్భం గా పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ శనివారం సమీక్ష నిర్వహించి.. చాలా మంది అర్హులు మిగిలి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. వారందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌. దీంతో పించన్‌ పొందే వారికి కాస్త ఊరట లభించనుంది.