కేసీఆర్-జగన్ కృష్ణా జలాల వివాదంలో బాబు బుక్ అవుతారా?

-

రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములు మాదిరిగా కలిసి ఉండాలనే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్-ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలు ఎంతో సఖ్యతతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఇద్దరు సీఎంలు సఖ్యతగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి కేసీఆర్ ప్రభుత్వం…జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల (కృష్ణా జలాల వివాదం), ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాలని అక్రమంగా చేస్తున్నారని తెలంగాణ నేతలు, ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. లేదు లేదు ఇవి సక్రమంగానే కడుతున్నామని చెప్పి ఏపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఇంతకాలం సఖ్యతగా ఉన్న నేతలు ఇప్పుడు సడన్‌గా నీటి యుద్ధం ఎందుకు మొదలుపెట్టడంపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులని ఏపీ ప్రభుత్వం ఆరు నెలల క్రితమే మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు కేసీఆర్, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అంటే హుజూరాబాద్ ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ గేమ్ మొదలుపెట్టారని అంటున్నారు. పైగా కేంద్రంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ వ్యూహం పన్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం సైతం పోలిటికల్ గేమ్ ఆడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబుని రాజకీయంగా ఇంకా వీక్ చేయడానికే జగన్ ప్రభుత్వం తెలంగాణతో నీటి కోసం తగాదా ఆడుతున్నట్లు ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో బాబు ఎటు మాట్లాడలేరు. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అది పరోక్షంగా జగన్‌కు సపోర్ట్ చేసినట్లు అవుతుంది.

అలా అని జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్టుని బాబు అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తాయి. కాబట్టి బాబుకు ఎటు వచ్చిన తిప్పలు తప్పేలా లేవు. అలా కాకుండా మౌనంగా ఉండిపోతే…వైసీపీ నేతలు రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి జగన్-కేసీఆర్ వాటర్ వార్‌లో బాబు బుక్ అవుతారేమో!

Read more RELATED
Recommended to you

Exit mobile version