కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఫేక్ అకౌంట్ ని తొలగించాలి..!

-

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా కంపెనీస్ ఫేస్బుక్, ట్విట్టర్ మరియు గూగుల్ లో ఫేక్ ప్రొఫైల్ ఫోటోలు తొలగించాలన్నారు. చాల మంది ప్రొఫైల్ ఫోటో లో ఫేమస్ పర్సనాలిటీస్ లేదా బిజినెస్ ఫేక్ ప్రొఫైల్స్ వంటివి క్రియేట్ చేస్తారు.

అదే విధంగా సాధారణ యూజర్లు కూడా కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో తొలగించాలని చెప్పారు. కొత్త IT రూల్స్ ప్రకారం ఈ రూల్ వచ్చింది. సోషల్ మీడియా దిగ్గజాలు వెంటనే దీనిపై స్పందించాలి.

కంప్లైంట్ వచ్చిన వెంటనే తొలగించాలని అన్నారు. తెలిసిన నటుడు, క్రికెటర్, నాయకుడు లేదా ఇతర యూజర్స్ ఫాలోవర్స్ కోసం ఫోటోలని ఉపయోగించి ఏమైనా ఇల్లీగల్ ఆక్ట్ చేసినట్లు గమనిస్తే అప్పుడు ఆ కంపెనీలకి యూజర్ల ని అడిగే హక్కు ఉంది.

ఏదైనా మోసాలు లేదా ఫ్రాడ్స్ లాంటివి చేయడానికి కావాలని ఇలా ఫేక్ ప్రొఫైల్స్ ని పెడుతున్నారని.. దీని వలన ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కొందరు ఇలా మోసాలు వంటివి చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకోవడం.. కంటెంట్ ని కూడా మోసం చేయడానికి టార్గెట్ చేసి అదే కంటెంట్ ని పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కంటెంట్ కి సంబంధించిన విషయాలు వాళ్ల ప్రొఫైల్ లో రాస్తారు. ఐటీ మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం సూచించబడిన grievance redressal mechanism కిందకు వస్తాయి మరియు సరైన కంటెంట్ లేక పోతే తొలగించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version