మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు

-

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధిక సంఖ్యలో అసెంబ్లీ ,పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయితే దేశంలో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుల మద్దతు కోరి దేశంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి ,బిజెపి భావిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్డీఏ కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి మరోసారి దేశ రాజధాని ని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటి వరకు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో పలువురు నేతలు, చంద్రబాబును కలిసేందుకు ఆసక్తి చూపడంతో వారందరినీ కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు ఢిల్లీలో చంద్రబాబు బిజీగా ఉంటారని పార్టీ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news