నారా లోకేశ్ కి చంద్రబాబు ఇచ్చిన న్యూ ఇయర్ షాక్ ఇదే ??

-

చంద్రబాబు రాజకీయ వారసుడిగా 2014లో పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రిగా నారా లోకేష్ విధులు నిర్వహించారు. అయితే ప్రజాక్షేత్రంలోకి వచ్చేప్పటికి చాలా సమావేశాలలో నారా లోకేష్ నాలుక కరుచుకుని నవ్వులపాలైన సంఘటనలు చాలా ఉండటంతో మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద కార్యక్రమాలలో కూడా సరైన మాటతీరు నారా లోకేష్ కి లేదన్నా అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోవడంతో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే నారా లోకేష్ కనుక చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ఇంకా కొనసాగితే మాత్రం టిడిపి పార్టీ భవిష్యత్తు అంధకారం అవడం గ్యారెంటీ అని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి.

అంతేకాకుండా 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోవడంతో..నారా లోకేష్ రాజకీయ ప్రయాణం పై అనేక మంది విమర్శలు చేస్తున్న తరుణంలో కొత్త సంవత్సరంలో సరికొత్తగా నారా లోకేష్ కి చంద్రబాబు చెక్ పెట్టి న్యూ ఇయర్ షాక్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం అండగా తన భార్య భువనేశ్వర్ ని తెరపైకి తీసుకురావటం జరిగింది. దీంతో నారా లోకేష్ ని చంద్రబాబు దాదాపు పక్కన పెట్టినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news