కేటీఆర్ అను నేను – తెలంగాణా ముఖ్యమంత్రిగా ???

-

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం గ్యారెంటీ అని టిఆర్ఎస్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇదే విషయంపై కేటీఆర్ అను నేను తెలంగాణ ముఖ్యమంత్రి అన్నట్టు వ్యాఖ్యలు చేశారు.

ఇదే తరుణంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఖచ్చితంగా త్వరలోనే కేటీఆర్ తెలంగాణ కు కాబోయే ముఖ్యమంత్రి అవుతారని అన్నట్టుగా కవిత కూడా వ్యాఖ్యానించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. విషయంలోకి వెళితే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకోవడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేటీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ చాలా మెజార్టీ స్థానాలు గెలవడంతో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ అదే స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్తారని అంటున్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news