ఏపీ ఈమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నారు : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నిప్పులు చెరిగారు. ఆయన జిల్లాలో పర్యటనలో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆయన కుప్పంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కనీసం కార్లు కూడా సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని చంద్రబాబు అన్నారు. సీఎం, వీఐపీ కాన్వాయ్ లకు అయిన ఖర్చు రూ.17.5 కోట్లు అని, తక్షణమే చెల్లించాలంటూ రవాణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం.. సీఎం పర్యటనకు కార్లు ఇచ్చిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

TDP chief Chandrababu Naidu booked again in Amaravati 'scam'- The New  Indian Express

ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పెండింగ్ బిల్లు అంశంలా మాత్రమే చూడరాదని, ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి నిదర్శనంలా చూడాలని చంద్రబాబు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజిని ఘోరంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత లేదు, సీఎంకు పాలన తెలియదు అని చంద్రబాబు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news