మహేశ్..సరిలేరు నీకెవ్వరు..‘సర్కారు వారి పాట’పై అనిల్ రావిపూడి కామెంట్స్ ఇవే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. మేజర్ అజయ్ గా చక్కటి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మహేశ్ ..ఆ తర్వాత దాదాపుగా రెండున్నరేళ్ల పాటు బిగ్ స్క్రీన్ పైన కనబడలేదు.

కొవిడ్ మహమ్మారి వలన పరిస్థితులలో మార్పులొచ్చాయి. అలా మహేశ్ నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ లేట్ అయింది. ఎట్టకేలకు ఈ పిక్చర్ గురువారం విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్నది. పరశురామ్ టేకింగ్ కు జనం ఫిదా అవుతున్నారు. మహేశ్ తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాలో చక్కటి నటన కనబరిచారని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రశంసించారు.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సైతం..‘సర్కారు వారి పాట’ చిత్రం చూసేశారు. సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, మెంటల్ మాస్ స్వాగ్ ను తన ఎనర్జీ మరో చక్కటి డెఫినెషన్ ఇచ్చారని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు దర్శకులు అనిల్ రావిపూడి.

Read more RELATED
Recommended to you

Latest news