అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను నేను సమర్థించను… స్పీకర్ తో చెప్పిన చంద్రబాబు

636

మంగళవారం కూడా సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పీకర్ తో పాటు.. అధికార పక్షం సభ్యులంతా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఏపీ బడ్జెట్ ను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బడ్జెట్ పై, ఇతర అంశాలపై బడ్జెట్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం రోజూ చోటు చేసుకుంటూనే ఉన్నది.

chandrababu says he doesn't agree with achennayudu words on speaker

మంగళవారం కూడా సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పీకర్ తో పాటు.. అధికార పక్షం సభ్యులంతా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

సభలో సమయం కేటాయింపు అంశంపై అచ్చెన్నాయుడు స్పీకర్ పై ఫైర్ అయ్యారు. సమయం కేటాయింపుపై అభ్యంతరం తెలిపిన అచ్చెన్నాయుడు… కోపంతో.. ఇక మీరే రాసివ్వండి… నేను చదువుతాను.. అంటూ స్పీకర్ ను ఉద్దేశించి అనడం సభలో పెద్ద దుమారం లేపింది.

దీంతో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం… అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంటూ చంద్రబాబును అడిగారు. దానికి చంద్రబాబు.. లేదు.. సమర్థించడం లేదు అంటూ బదులిచ్చారు.

వెంటనే చంద్రబాబు మళ్లీ మైకు అందుకొని… నాపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అంటూ స్పీకర్ ను అడిగారు. అయితే.. వెంటనే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దానికి అభ్యంతరం తెలిపారు. సభలో అత్యంత సీనియర్ అయిన నాయకుడిని పట్టుకొని అలా చంద్రబాబు ప్రశ్నించడం కరెక్ట్ కాదన్నారు.

ఇంతకీ వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఏమన్నారనే మీ ప్రశ్న. ఒకప్పుడు ఎన్టీఆర్ సభలో మాట్లాడుతానని ఎంత ప్రాధేయపడినా.. ఆయనకు మైక్ ఇవ్వలేదని… సొంత మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. ఆ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని.. చంద్రబాబును ఉద్దేశిస్తూ రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు.