‘వైసీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైల్లో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు’

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జైల్లో ఆయనకు సరైన భద్రత లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో ఆయనకు హాని తలపెట్టే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ వ్యవహారం చూస్తుంటే… మీరు, మీ పార్టీ వారే జైల్లో ఉన్న చంద్రబాబుకు హాని తలపెడతారనే అనుమానం కలుగుతోందని అన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నేతల్లో కనిపిస్తోందని చెప్పారు. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైల్లో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?’ అని మరో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబును జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు నారా లోకేశ్. చంద్రబాబుకు జైల్లో ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని అన్నారు. సీఎం సైకో జగన్ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ చేశారు లోకేశ్.జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర జరుగుతోందన్నారు లోకేష్. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడని లోకేశ్ అన్నారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version