ఢిల్లీ మెడలు వంచుతానని…జగనే వంచాడు : చంద్రబాబు

అమరావతి : ఢిల్లీ మెడలు వంచుతానని.. ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ ముందు మెడలు వంచుతున్నారని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాని కట్టడి చేసేవాళ్ళమని… ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది…జగన్ ఖజానా గళ గళ లాడుతోందని మండిపడ్డారు. మనుషులతో మాట్లాడేవాళ్ళు కావాలి కానీ ఆత్మలతో మాట్లాడేవాళ్ళు ప్రజలెందుకు అని ఫైర్‌ అయ్యారు.

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదని.. భావి తరాల భవిష్యత్తు కోసం కేసులకు భయపడకుండా పని చేస్తామన్నారు. రైతుల వద్ద పంటలు కొంటూ నెలల కొద్దీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని… రైతులు తిరగపడితే పారిపోతారని హెచ్చరించారు. అమ్మిన పంటకు డబ్బులు ఇవ్వమంటే అక్రమ కేసులు పెట్టడమేంటి ? అని ప్రశ్నించారు.

రైతుల్ని నట్టేట ముంచారని… కరోనా ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల కుటుంబాలకు కుటుంబాలు తుడుచుపెట్టుకుపోయాయని.. కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి చదువు చెప్పే టీచర్లను కాపలాగా పెట్టడం దుర్మార్గమని ఆగ్రహించారు. ఆసుపత్రుల నిర్వహణ, మందులు, ఆక్సిజన్ అందించటంలో విఫలమయ్యారన్నారు.