కొవ్వు ఎక్కువైతే వచ్చే వ్యాదితో బాధపడుతున్న బాబు!

-

సాదారణంగా అల్జీమర్స్, స్క్రిజోఫీనియా అనే వ్యాదులు మానసిక సమస్యల వల్ల వచ్చే వ్యాదులు! అయితే ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్జీమర్స్ వచ్చాయని రాజకీయ వర్గాల్లో విమర్శలతో కూడిన చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా చంద్రబాబుకు మరోరకం వ్యాది వచ్చిందని చెబుతున్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!


అవును… ఏపీ సీఎం జగన్ పై అవినీతి కేసులు నిరూపణ అయితే, 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని ఏడీఆర్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఉటంకించిన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు “అల్జీమర్స్” ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని.. “స్క్రిజోఫీనియా” ముదిరిపోయిందని వ్యాఖ్యానించారు.

అవును… చంద్రబాబుకు అల్జీమర్స్ ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని, చంద్రబాబు తనను తాను పూర్తిగా మర్చిపోయాడని.. ఇప్పుడు తనను తాను జడ్జి పాత్రలో ఊహించుకుంటున్నాడని.. ఆ క్యారెక్టర్ లో తీర్పు కూడా ఇచ్చేశాడు.. చంద్రబాబును ఇకపై ఎవ్వరూ ఏమీ అనొద్దు! అంటూ విజయసాయి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

కాగా… చిన్నవయసులో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు ఎక్కువైపోతే పెద్దయ్యాకా మానసిక సమస్యలతో పాటు, జ్ఞాన సంబంధమైన స్క్రిజోఫీనియా, అల్జీమర్స్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news