ఏపీ ఎలక్షన్ వార్ ఆఖరి దశ కి చేరుకుంది. పోలింగ్ కి ఇంకో 13 రోజులు మాత్రమే సమయం ఉంది ఈ క్రమం లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ని మంగళవారం విడుదల చేసారు. ఉండవల్లి లోని టిడిపి చీఫ్ చంద్రబాబు నివాసం లో పవన్ కళ్యాణ్ సిద్ధార్థ సింగ్ బాబు ఇతర నేతలు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు.
టీడీపీ ఆరు ప్రధాన హామీలు ఇచ్చింది రాష్ట్రం లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, యువతకు 20 లక్షల కి పైగా ఉద్యోగాలు, నెలకి రూ.3,000 నిరుద్యోగ భృతి. స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000. ప్రతి ఇంటికి ఉచిత నల్ల కనెక్షన్ ప్రతి మహిళకి నెలకి 1500 అలానే బీసీల రక్షణ కి ప్రత్యేక చట్టం.