చంద్రబాబు అనవసరంగా కంగారు పడుతున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీని ఎదుర్కోవడం ఏమో గాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు ఇప్పుడు ప్రజలకు వింతగా ఉన్నాయని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరమా ఉంది.

కాని ఆయన ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోయినా సరే చంద్రబాబు మాత్రం పదే పదే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి సూచనలు చెయ్యాల్సిన సమయంలో ఆయన విమర్శలు చేస్తున్నారు. పరిక్షలు చేసే విషయంలో కిట్స్ కొరత బాగా ఉంది. ఈ విషయం చంద్రబాబుకి కూడా స్పష్టంగా తెలుసు.

అయినా సరే ఆయన మాత్రం విమర్శలను అసలు ఆపడం లేదు. పదే పదే పరిక్షలు చేయడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా సరే… చంద్రబాబు పదే పదే 5 వేలు ఇవ్వాలి పేదలకు ఇవ్వాలి అని అంటున్నారు. దీనిపై ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో ఆర్ధిక పరిస్థితి బలంగా ఉన్నా సరే 1500 మాత్రమే ఇచ్చారు.

లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది. దీనితో ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆదాయ మార్గాలు లేని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఇప్పుడు అంత మొత్తం ఇస్తుంది అనేది కూడా అర్ధం కాకుండా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి లాక్ డౌన్ ని సడలించే అవకాశం లేదు. సడలిస్తే మాత్రమే ఆదాయం వస్తుంది. మరి ఇది తెలిసి కూడా చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news