దేశంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ బీజేపీ కే పట్టం కడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు. బిహార్ లో నితీశ్ కుమార్ ఎన్డీఏ వెంటే ఉన్నారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికాం. మహారాష్ట్ర రైతులకు అండగా నిలిచాం. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా బీజేపీ పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సెటైర్లు వేశారు. దేశంలో పురాతనమైన పార్టీ దేశ రాజధానిలో ఖాతా తెరవలేకపోయిందని అన్నారు. జీరో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది.. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై విశ్వాసం ఉంచేందుకు సిద్ధంగా లేరని.. కాంగ్రెస్ పరాన్న జీవి పార్టీగా మారుతుందని గతంలోనే తాను చెప్పినట్టు గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఢిల్లీ ప్రజలు బీజేపీని మనసారా ఆశీర్వదించారని.. మీ ప్రేమకు అనేక రెట్లు తిరిగి ఇస్తామన్నారు.