చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7000 మంది పోలీసులతో బందోబస్తు

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి.బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తుండటంతో దాదాపు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

నగరంలో వీఐపీలు బసచేసే హోటల్స్‌ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు.. కార్యకర్తలు విజయవాడ చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version