కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ … కమల్ హాసన్ పై ప్రశంసల వెల్లువ

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిన్న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ట్రైలర్ సినీ ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఇక ఈ సినిమాలో కమలహాసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విశ్వనటుడిగా పేరొందిన కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులోనూ ప్రయోగాలు చేసేందుకు వెనుకాడట్లేదు.

నిన్న విడుదలైన ‘కల్కి’ ట్రైలర్లో ఆయన లుక్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తమ్మిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ‘భారతీయుడు-2’లో సేనాపతిగా మరోసారి అలరించేందుకు కమలహాసన్ సిద్ధమయ్యారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘థగ్ లైఫ్’లోనూ కొత్త అవతారంలో కమల్ హాసన్ కనిపించనున్నారు. దీంతో సినిమా పట్ల కమల్ హాసన్ డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version