తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా వుంచిన చంద్రమోహన్.. అందుకేనా..?

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే చాలామంది తమ తదనాంతరం తమ పిల్లలను వారసులుగా ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టాలని చూస్తూ ఉంటారు. ఇకపోతే ప్రముఖ నటుడు చంద్రమోహన్ మాత్రం ఇండస్ట్రీకి తన పిల్లల్ని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే ఆయన ఏ రోజు కూడా తన పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది లేదు. ఇక నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా పనిచేస్తున్న నటులలో చంద్రమోహన్ కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా, విలన్ గా ఇలా ఎన్నో రకాలుగా నటించి.. సుమారుగా 900 కు పైగా చిత్రాలలో నటించారు.

ఇక ఇందులో 175 సినిమాలలో చంద్రమోహన్ హీరోగా నటించడం గమనార్హం. అంతేకాదు ఈయన పక్కన చేసిన చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి కొంతమంది హీరోయిన్లు ఉండడం గమనార్హం. ఇండస్ట్రీలోకి తన పిల్లలను ప్రవేశపెట్టక పోవడానికి గల కారణాన్ని కూడా చంద్రమోహన్ ఇటీవల వెల్లడించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఇద్దరూ కూడా చాలా బాగుంటారని.. ఒకానొక సమయంలో భానుమతి గారు పిల్లలిద్దర్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేద్దామని అడిగారట. కానీ ఆ సమయంలో తాను వద్దన్నానని చంద్రమోహన్ తెలిపారు.

నటుడిగా బిజీగా ఉన్న సమయంలో తనకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదని.. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లొకేషన్ కు వచ్చిన వాళ్ళు తనను గుర్తుపట్టే వాళ్ళు కాదని చంద్రమోహన్ తెలిపారు. ఇక తనలా. తమ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పిన ఆయన సినిమా ప్రభావం వారిపై పడకుండా పెంచామని కూడా ఆయన తెలిపారు. చంద్రమోహన్ కోరిక మేరకు ఆ పిల్లలిద్దరూ కూడా ఉన్నత చదువులు చదివి గోల్డ్ మెడల్ సాధించి మరీ ప్రస్తుతం ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు.. ఈ విషయాలన్నింటిని కూడా చంద్రమోహన్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news