వావ్‌.. తొలి చిత్రాన్ని పంపిన చంద్రయాన్‌-3

-

ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. అయితే.. చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్ ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది.

అయితే.. ఎంతో కీలకమైన వర్టికల్‌గా విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడిపై చంద్రయాన్‌-3 ల్యాండ్‌ అయ్యే దృశ్యాలు బెంగళూరు నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు ఇస్రో అధికారులు.. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ సైతం వీక్షించారు. ప్రపంచా వ్యాప్తంగా ఉన్న భారతీయులే కాకుండా.. అందరూ చంద్రయాన్‌-3పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. చంద్రయాన్‌ -3 జాబిల్లిపై ల్యాండ్‌ అయ్యే కీలక 17 నిమిషాల ప్రక్రియలను ఇస్రో సైంటిస్టు నిశితంగా పరిశీలించారు. ముందుగా.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి క్షణం క్షణం ఉత్కంఠ పరిస్థితిని అంచనా వేశారు అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news