రాష్ట్రంలో అన్ని పాఠశాలలో కూడా ఈ నెల 15వ తేదీ నుండి ఒక పూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం 12:30 గంటల నుండి ఈ మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేయాలని మధ్యాహ్నం భోజనం అందించిన తర్వాత పిల్లల్ని ఇంటికి పంపించాలని ఆదేశించారు.
ఈనెల 18 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు వరకు నిర్వహించాలని అన్నారు 2023- 24 విద్యాసంవత్సరానికి పాఠశాలలకు ఏప్రిల్ 23న చివరి పని దినంగా విద్యాశాఖ నిర్ణయించింది అప్పటిదాకా కలిసి భోజనాలు చేస్తారు ఈ సమాచారాన్ని రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారు.