భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తున్న పేటీఎం..!

-

ఈమధ్య చాలా కంపెనీల్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతుండడం వలన ఉద్యోగులని తొలగిస్తున్నారు. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులని తొలగించారు. ఇప్పుడు అదే కోవ లోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ పేటీఎం కూడా వచ్చింది. భారీగా తమ ఉద్యోగులని తొలగించే పనిలో ఉంది కంపెనీ ఉద్యోగుల 20 శాతం మందిని తొలగించవచ్చని తెలుస్తోంది.

మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య జరిగింది. విభాగాలు టీం సైజ్ 20% చేయాలనే నిర్ణయించారు. పర్ఫామెన్స్ బేస్డ్ ఉద్యోగ కోతలపై ఎంతమంది అని ఈ సమాచారం ఇవ్వలేదు. పర్ఫామెన్స్ కాకుండా కృత్రిమ మేధస్సు నడిచే ఆటోమేషన్ వైపు కంపెనీ దృష్టి పెడుతుందని చాలామంది ఉద్యోగులను బయటకు పంపవచ్చు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news