మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు పొందాలన్నా, రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్న, స్కీమ్స్ కోసమైనా ఆధార్ కార్డు ఉంటేనే అవుతుంది. అలానే మొబైల్ సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కోసం కూడా ఆధార్ కావాలి. ఇది ఇంత ముఖ్యం కాబట్టి అందులో వుండే వివరాలు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆధార్‌లో వివరాలు సరిగా లేకపోతే ముఖ్యమైన పనులు చేసుకునే సమయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా మీరు మీ ఫోన్‌లో వాడుతూ ఉండాలి కూడా. ఓటీపీ రాకపోవడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. కనుక మొబైల్ నెంబర్ కూడా మీరు మీ ఫోన్‌లో ఉండేలా చూసుకోండి.
పాత నెంబర్ పోయినా లేదు అంటే మరో నెంబర్ ని మీరు వాడుతున్నా దానితో కార్డుని లింక్ చేసుంటే మంచిది. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మీ ఆధార్ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే దగ్గరిలోని ఆధార్ కేంద్రంకి వెళ్లి అప్డేట్ చేసుకోచ్చు. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడం అవ్వదు. కనుక కచ్చితంగా ఆధార్ సెంటర్ కి వెళ్ళాలి. అయితే ఆధార్ సెంటర్ కి వెళ్లే ముందు ఈ చిన్న ప్రక్రియని పూర్తి చెయ్యాలి.
యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అపాయింట్‌మెంట్ ని తీసుకోవాలి. ఏ రోజు ఏ టైమ్‌కు వెళ్లాలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ టైమ్‌కు వెళ్లి పని పూర్తి చెయ్యచ్చు. ఇలా చేస్తే టైం కి వెళ్ళచ్చు. టైం సేవ్ అవుతుంది.
https://appointments.uidai.gov.in/bookappointment.aspx ద్వారా అపాయింట్‌మెంట్ ని ఈజీగా బుక్ చెయ్యచ్చు. లేదు అంటే పోస్ట్‌మ్యాన్ కూడా ఆధార్ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. మీ ఏరియాలోని పోస్ట్‌మ్యాన్ సాయంతో మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోచ్చు.