జగన్ తిరుమల పర్యటనలో మార్పులు.. అందుకే !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ఆయన తాడేపల్లి నుండి తిరుమల వస్తారని అనుకున్నా ఆకస్మికంగా ఢిల్లీ పెద్దల నుండి కబురు రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. నిన్న సాయంత్రం అమిత్ షాను కలిసిన ఆయన ఈ ఉదయం మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఇక ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు రానున్న జగన్ రెండు గంటలకే తిరుమలకు చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం.. పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు.

సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలానే రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం, 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్నారు. 24న అంటే రేపు ఉదయం 7 నుంచి 8 వరకు సుందరకాండ పఠనంలో జగన్ పాల్గొననున్నారు. అలానే రేపు ఉదయం 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ యడ్యూరప్పతో కలిసి పాల్గొననున్నారు. రేపు రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్, అక్కడి నుండి తాడేపల్లి నివాసానికి చేరుకోకున్నారు.