మీరు జైపూర్ వెళ్తున్నారా…? అయితే తప్పకుండా ఈ రాజస్థానీ వంటకాలు తినాల్సిందే..! నిజంగా కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఫేమస్ ఫుడ్ ను తినడం చాలా మందికి ఇష్టం. మీకు కూడా ఇష్టమా అయితే తప్పకుండా ఈ రాజస్థానీ వంటకాల్ని ట్రై చేయండి. నిజంగా వీటి రుచి చాలా బాగుంటుంది. పైగా ఒక్కసారి తిన్నారంటే వదిలి పెట్టడం కష్టం.
చుర్మ:
ఇక్కడ చాలా ఫేమస్. దీనిని సెనగపిండి, పాలు, బెల్లం, యాలుకల పొడి మొదలైన వాటిని వేసి తయారు చేస్తారు. ముఖ్యంగా ఉపవాసం ఉన్న సమయం లో దీనిని తింటారు. ఇది చాలా పాపులర్.
దికుషర్:
ఇది చూడడానికి బర్ఫీ లా ఉంటుంది. కానీ రుచి మాత్రం చాలా అమోఘం అనే చెప్పాలి. దీనిని బేసన్ కి చెక్కి లేదా మోహన్దార్ అని కూడా అంటారు. పెళ్లి లో వీటిని ఎక్కువగా పెడుతూ ఉంటారు. నెయ్యి, డ్రైఫ్రూట్స్ తో దీనిని తయారు చేస్తారు. ఒకవేళ మీరు కనుక జైపూర్ వెళ్లారు అంటే తప్పకుండా వీటిని ట్రై చేయండి.
సోహాన్ హల్వా:
నిజంగా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. నోరూరిపోతుంది కూడా. మొగలాయిల కాలం నుంచి కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ జైపూర్ వెళ్తే సోహాన్ హల్వాని మాత్రం మిస్ అవ్వద్దు.
మీటి లడ్డు దన:
సాయంత్రం పూట స్నాక్స్ కింద తీసుకోవడానికి ఇదే బెస్ట్ డిష్. దీనిలో అల్లం, పంచదార చాలా ఉంటాయి. ఇది చేదు, కారం, తీపి కలిగి ఉంటుంది. ఒకవేళ జైపూర్ వెళితే దీనిని కూడా మీరు మిస్ కాకండి.
మవా కచోరీ:
కచోరి ప్రియులకి ఈ డిష్ బాగా నచ్చుతుంది. దీనిని ఇండియన్ పేస్ట్రీ అంటారు. జోద్పూర్ నుంచి దీనిని తీసుకు రావడం జరిగింది. పంచదార సిరప్ నుంచి దీనిని తీసి చేస్తూ ఉంటారు. పైగా ఇది చాలా ఫేమస్ కూడా. ఒకవేళ మీరు ఎప్పుడైనా జైపూర్ కి వెళ్లారు అంటే వీటిని మాత్రం టేస్ట్ చేయకుండా రావద్దు. నిజంగా ఎంత చెప్పిన తక్కువే.