Telangana: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

-

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను ఇంట‌ర్ బోర్డు మార్చాల్సి ఉంది. స‌వ‌రించిన షెడ్యూల్ ప్ర‌కారం.. ఏప్రిల్ 22 నుంచి మే 11 వ‌ర‌కు ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వ‌ర‌కు ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 08 తేదీ వ‌ర‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు.. ఏప్రిల్ 11న ఎథిక్స్‌, 12న హ్యుమ‌న్ వాల్యూస్ ప‌రీక్ష‌లు జ‌రుపనున్నారు.

ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల షెడ్యూల్

ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, ఏప్రిల్ 25న ఇంగ్లీషు పేప‌ర్‌-1, ఏప్రిల్ 25న‌, ఇంగ్లీష్ పేప‌ర్‌-1 27న మ్యాథ‌మేటిక్స్ పేప‌ర్ 1ఏ, బోట‌నీ పేప‌ర్ -1 పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1, 29న మేథ‌మెటిక్స్ పేప‌ర్ 1 బీ, జువాల‌జీ పేప‌ర్ -1, మే 09న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ‌మెటిక్స్‌, పేప‌ర్‌-1 (బైపీసీ విద్యార్థుల‌కు), మే 11న మోడ‌ర్న్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, జాగ్ర‌ఫీ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి.

ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్

ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, ఏప్రిల్ 26న ఇంగ్లీషు పేప‌ర్ 2, 28న మ్యాథ‌మేటిక్స్ పేప‌ర్ 2 ఏ, బోట‌నీ పేప‌ర్ -2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -2, 30న మేథ‌మెటిక్స్ పేప‌ర్ 2 బీ, జువాల‌జీ పేప‌ర్ -2, మే 10న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ‌మెటిక్స్‌, పేప‌ర్‌-2 (బైపీసీ విద్యార్థుల‌కు), మే 12న మోడ‌ర్న్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, జాగ్ర‌ఫీ పేప‌ర్‌-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news