డ్రగ్స్ కేసు: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న ఛార్మి

తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈడీ ఈ కేసును విచారిస్తుంది. మాదక ద్రవ్యాల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ఈడీ అధికార్లు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 15మంది సెలెబ్రిటీలకు నోటీసులు పంపినట్లు సమాచారం. ఆల్రెడీ పూరీ జగన్నాథ్, ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు నటి ఛార్మి ఈడీ ఎదుట హాజరు కానుంది.

డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మీకి నోటీసులు జారీ చేసారు. మనీలాండరింగ్ నేపథ్యంలో ఛార్మీ బ్యాంకు ఖాతాలను, స్టేట్మెంట్లను పరిశీలించనున్నారు. అటు ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు తీస్తున్న ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. మరి ఈ విచారణలో ఏం తేలనుందో చూడాలి.