విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమం తప్పదు.. సీపీఐ నేత రామక్రిష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల విషయంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా సీపీఐ నేత రామక్రిష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లు ఛార్జీలు పెంచి ఆ హామీలను తుంగలో తొక్కారని, ఇది సబబు కాదని లేఖలో పేర్కొన్నారు.

అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై 3,669కోట్ల భారం మోపడం తగదని, కేంద్ర ఇచ్చే 2500కోట్ల అప్పుకు ఆశపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, ఇది మంచిది కాదని, ప్రజలపై ఆర్థిక భారం మోపడం కరెక్టు కాదని, పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, లేదంటే ఉద్యం లేవదీస్తామని తెలిపారు. మరి ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.