22న హైదరాబాద్‌కు చెగువేరా కుమార్తె

-

క్యూబా విప్లవ యోధుడు చెగువేరా కూతురు డాక్టర్‌ అలైద గువేరా, ఆమె తనయ ప్రొఫెసర్‌ ఎస్టిఫోనియా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. కొద్దిరోజుల కిందట దిల్లీకి చేరుకున్న అలైదా గువేరా, అక్కడి నుంచి వైద్యసేవల నిమిత్తం కేరళకు వెళ్లారు. 22న హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో చెగువేరా తనయ, మనవరాలికి ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రొ.శాంతాసిన్హా, ప్రొ.హరగోపాల్‌, ప్రొ.కె.నాగేశ్వర్‌ సహా బీఆర్ఎస్, కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉపన్యాసకులుగా హాజరవుతారు. వారికి ఘనంగా స్వాగతం పలకాలని భాజపా, మజ్లిసేతర పార్టీల ప్రతినిధులతో కూడిన సంఘీభావ కమిటీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news