జీర్ణ సమస్యలకి ఇలా చెక్ పెట్టేయండి..!

-

ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. కాన్స్టిపేషన్ సమస్య నుండి జీర్ణ సమస్యల వరకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు ఆయుర్వేద నిపుణులు కొన్ని సహజమైన పద్దతులు గురించి చెప్పారు. ఈ పద్ధతులు పాటిస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.. అలానే మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మరి ఆయుర్వేద నిపుణులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఒక లుక్ వేసేయండి.

 

digestive problems

వజ్రాసనం వేయండి:

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేస్తే చాలా మంచిది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బాగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి వజ్రాసనం వెయ్యండి.

భోజనంతో పాటు మజ్జిగ:

భోజనంతో పాటు మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇది చల్లదనాన్నిస్తుంది అదే విధంగా ఎసిడిటీ మొదలైన సమస్యలుని తొలగిస్తుంది. కాబట్టి తప్పకుండ భోజనం తో మజ్జిగ తీసుకోండి.

ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు:

పండ్లు మరియు పాలు, చేప మరియు పాలు, తేనె మరియు వేడి నీళ్ళు ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఈ కాంబినేషన్ లో తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

నట్స్ ని నానబెట్టండి:

నీళ్లలో నానబెట్టి నట్స్ ని తీసుకుంటే మంచిది. దీనిలో పోషక పదార్థాలను ఇస్తుంది. అలానే జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

పచ్చి కూరగాయలు తీసుకోవద్దు:

అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లు పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల మరింత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పచ్చి కూరగాయలు అసలు తీసుకోవద్దు.

ఎక్కువ నడవండి:

కనీసం రోజుకి ఐదు వేల అడుగులు వేస్తే చాలా మంచిది. కాబట్టి ప్రతీ రోజు కాసేపు నడవండి. ఇలా ఈ ఆరోగ్యకరమైన పద్ధతులని పాటిస్తే ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news