ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం హుజూరాబాద్ బైపోల్. ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు ప్రతీ గ్రాామాన్ని తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కులాల వారీగా కలుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈసారి రాజకీయ ప్రాధాన్యంతో ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కరోనా కష్టకాలంలో ఓటర్ల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా ప్రతీ ఓటర్ కు వ్యాక్సిన్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వారం రోజుల్లో హుజూరాబాద్ లోని ప్రతీ ఓటర్ కు వ్యాక్సిన్ వేయనున్నారు. ఓటింగ్, ప్రచారం సమయంలో భారీ జనసందోహం ఉండే అవకాశం ఉంటుంది. ఇటు వంటి పరిస్థితుల్లో కరోనా సులభంగా వ్యాప్తిచేందే అవకాశం ఉండటంతో, వ్యాక్సిన్ నిర్ణయం తీసుకున్నారు.