సీజనల్ ఇన్ఫెక్షన్స్ కి ఇలా చెక్ పెట్టండి..!

-

మామూలుగా మనకి సీజన్ మారితే ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి. అయితే అటువంటి ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉండాలన్నా.. వాటితో పోరాడాలన్న మంచి ఆహారం అవసరం. అలాగే ఆహారంతో పాటు నీళ్లు కూడా ఎక్కువ తాగుతూ ఉండండి. సీజనల్ లో వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఈ చిట్కాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. వాటి కోసం కూడా ఇప్పుడు చూద్దాం.

అల్లం, తేనె, ఉప్పు:

మీరు రాళ్ల ఉప్పుని తేనె, అల్లం పొడితో కలిపి తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనం పొందవచ్చు. ఈ పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే ఉబకాయం, పీరియడ్స్ నొప్పి, చేతులు పాదాల్లో నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి సీజనల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.

జీలకర్ర:

జీలకర్ర ఒత్తిడిని తగ్గిస్తుంది అలానే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీలకర్రలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పొట్టకు సంబంధించిన వ్యాధులని కూడా ఇది తగ్గిస్తుంది కాబట్టి జీలకర్ర కూడా మీరు తీసుకుని ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.

నిమ్మ, తేనె :

గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా చూసుకుంటుంది. రక్త కణాలను పెంచడంతో సహాయపడుతుంది. అలానే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. మీరు కనుక ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కచ్చితంగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుండి బయటపడొచ్చు. పైగా సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news