యూపీలో జరిగిన ఘటను బీజేపే కారణమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆపార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటనలో రైతులు మరణించిన ఘటనకు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల బీజేపీ అమానుషంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులను బీజేపీ మంత్రి కుమారుడు తొక్కించిన మోదీ, యోగీలు చర్యలు తీసుకోవడం లేదని, పరామర్శకు వెళ్లిన ప్రియాంక గాంధీని అరెస్ట్ చేశారని విమర్శించారు. అమానుష ఘటనకు కారణమైన యూపీ ప్రభుత్వాన్న రద్దు చేసి రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని అన్నారు. మోదీ 80 కోట్ల రైతులకు మరణ శాసనం రాశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశ సంపద అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. రైతు చట్టాలకు వ్యతిరేఖంగా రాష్ట్రం తీర్మాణం చేసి పంపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
-