జగనన్న విద్యా దీవెన స్కీమ్ డబ్బులు అందలేదా..? అయితే ఇలా చెక్ చేసుకోండి..!

-

జగనన్న విద్యా దీవెన స్కీమ్ డబ్బులు వస్తాయి అనుకున్నా ఇంకా రాలేదా…? ఎప్పుడు పడతాయో కూడా మీకు తెలీదా..? అయితే ఇలా చెక్ చేసుకోండి. దీని కోసం మీరు ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో వుండే చెక్ చేసుకోవచ్చు. అర్హుతలైన వారికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జగనన్న విద్యా దీవెన పథకం కింద బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది.

 

కొందరి ఎకౌంట్ లో ఇంకా అవి పడలేదు. అయితే ఏ ఆందోళన పడకుండా ఇలా డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది తెలుసుకోవచ్చు. వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటే పొరపాటు. కాస్త టైమ్ పడుతుంది గమనించండి. కనీసం 15 రోజులు కూడా పట్టొచ్చు.

అందువల్ల డబ్బులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈసారి విద్యా దీవెన డబ్బులు నాలుగు విడతల్లో వస్తాయని గమనించాలి. అలాగే బ్యాచ్‌లుగా కూడా డబ్బులు వస్తుంటాయి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయనేది తెలుసుకోవచ్చు. దీని కోసం జ్ఞానభూమి పోర్టల్ ‌లోకి వెళ్లాలి. స్టూడెంట్ ఆధార్, పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వాలి.

ఆ తర్వాత వ్యూ లేదా ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మీ స్టేటస్ ఎలిజిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అనే అని చూపిస్తుంది. అంటే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్థం. రిలీజ్డ్ అని ఉంటే డబ్బులు వచ్చినట్లు. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత వారం రోజుల్లో డబ్బులు రావొచ్చు. ఈ నెంబర్ ఉంటే పీఆర్‌డీసీఎఫ్ఎంఎస్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news