రోహిత్ శర్మ చేసిన తప్పుకు..టీమ్ మొత్తంపైన నిషేధం వేటు తప్పదా ?

-

 ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళశారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం రాత్రి చేపాక్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నెమ్మదిగా ఓవర్ రేటు ఇచ్చినందుకు రూ .12 లక్షలు జరిమానా విధించారు. ప్రత్యర్థికి మ్యాచ్‌ను ధారదాత్తం చేసుకోవడమే కాకుండా.. జరిమానాను ఎదుర్కొనవలసి వచ్చింది.

రోహిత్ శర్మపై 12 లక్షల రూపాయల జరిమానా విధించారు నిర్వాహకులు. స్లోయర్ ఓవర్ రేట్ కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది రెండో జరిమానా. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీద కూడా 12 లక్షల రూపాయల ఫైన్ పడిన విషయం తెలిసిందే. ఇక రోహిత్ శర్మకు ఇదే తొలి జరిమానా. మరోసారి స్లోయర్ ఓవర్ రేట్‌ను నమోదు చేస్తే.. రోహిత్ శర్మకు పడే జరిమానా రెట్టింపు అవుతుంది.

 

అదే సమయంలో ఆ మ్యాచ్‌ ఆడిన 11 మంది క్రికెటర్లకు కూడా ఫైన్ మొత్తాన్ని వర్తింపజేస్తారు నిర్వాహకులు. అదే మూడోసారి కూడా స్లోయర్ ఓవర్ రేట్‌ను నమోదు చేస్తే.. ఆ జట్టు కేప్టెన్‌పై 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌లో నిషేధం వేటు పడుతుంది. ఇక ఆ మ్యాచ్ ఆడిన 11 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం- ఇందులో ఏది తక్కువ మొత్తమైతే దాన్ని వర్తింపజేస్తారు. సో ధోనీ జట్టుతో పాటు, రోహిత్ సేన కూడా జాగ్రత్తగా ఆడడం మంచింది. 

Read more RELATED
Recommended to you

Latest news