సాధారణంగా విజయదశమి వచ్చిందంటే చాలు ఒక్కో ఏరియాలో ఒక్కో విధమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా సందర్భంగా చెడీ తాలింఖానా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. విజయదశమి సందర్భంగా ఆయుధాల ప్రదర్శనలతో ఊరేగింపులు నిర్వహించడం ఇక్కటి ప్రత్యేకత. 1835లో అమలాపురం కొంకాపల్లి వీధిలో ఈ చెడీ తాలింఖానా ఉత్సవాన్ని ప్రారంభించారు. 189 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి.
అమలాపురం దసరా చెడీ తాలింఖానా వేడుకలు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఏడు వీధులు ఊరేగింపులు కొనసాగనున్నాయి. కర్ర సాము, కత్తి సాము వంటి 60 రకాల యుద్ధ
విన్యాసాలతో చెడీ తాలింఖానా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమలాపురంలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు పోలీసులు. ద్విచక్ర వాహనాల మినహా ఇతర వాహనాలకు అమలాపురం పట్టణంలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అమలాపురం మహిపాలవీధిలోని అబ్బిరెడ్డి రామదాస్ చెడీ తాలింఖానా 189వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే.