మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ ఎంక్లోజర్స్ నుండి నమీబియాకు చెందిన చిరుత తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నేషనల్ పార్క్ సరిహద్దులో నివసించే ప్రహాలు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. అప్పటి నుండి అధికారులు ఈ చీతాను కనుగొనడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలలో సెర్చింగ్ మొదలు పెట్టారు. అయితే చివరికి నేషన్ పార్క్ కు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో చీతా ఉందన్న విషయాన్నీ అధికారులు గుర్తించారు.
అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతోనే సాధ్యమయింది, లేదంటే ఇంకా మరికొన్ని రోజులు తప్పకుండా పట్టేది. చీతా దొరకడంతో అధికారులు మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారు కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే నమీబియా నుండి తీసుకువచ్చిన 8 చీతాలలో … మార్చి రెండవ వారంలో 4 చీతాలను మరియు మార్చి 22న నాలుగు చీతాలను ఫ్రీ ఎంక్లోజర్ లో వదలడం జరిగింది.