ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే… ఫుట్ బాల్ అని తడుముకోకుండా చెప్పచ్చు. క్రికెట్ తర్వాత అంతగా ఇండియన్స్ కూడా ఇష్టపడేది ఫుట్ బాల్, ప్రపంచ వ్యాప్తంగా సాకర్ వరల్డ్ కప్ తర్వాత ఎన్నో లీగ్ లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి ఒక లీగ్ లో ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక ఫుట్ బాల్ క్లబ్ ఒక ప్లేయర్ కోసం 55 మిలియన్ ఫౌండ్స్ ను వెచ్చించారట, అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం రూ. 577 కోట్లు. చెల్సియా అనే ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన మానస్ మౌంట్ అనే ప్లేయర్ కోసం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఇంత మొత్తంగా డబ్బును చెల్లించడానికి ఆ క్లబ్ నిర్ణయించుకుంది. అయితే ఎందుకు ఇంత మొత్తం అమౌంట్ ను చెల్లిస్తుందని అంటే.. గత 2020 – 2021 మరియు 2021 – 2022 సీజన్ లకు గానూ చెల్సియా క్లబ్ తరపున మానస్ మౌంట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా నిలవడమే కారణమని తెలుస్తోంది.
మరి ఈ లీగ్ తరపున మానస్ మౌంట్ ఏ విధంగా రాణిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.