బీఆర్ఎస్ కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆయన . తన నియోజకవర్గంలో తనను పక్కన పెట్టాలని చాలా మంది చూస్తున్నారని మండిపడ్డారు. తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్న ఆయన.. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తననే ఆధారిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు.
తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి ఆశ లేదన్నారు రమేష్. అభిమానం అనేది ప్రజల గుండెల్లో ఉండాలని, ఫ్లెక్సీలలో కాదని చురకలు అంటించారు ఆయన. భూములు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు చెన్నమనేని.