జైలు బయట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ ను విచారణ నిమిత్తం సిట్ కస్టడీలోకి తీసుకుంది. విచారణకు తీసుకెళ్తున్న సమయంలో విజయవాడ జైలు బయట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేశారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎవరినీ కూడా వదలనంటూ ఆయన పెద్ద ఎత్తున గట్టిగా నినాదాలు చేశారు. కాగా ఈరోజు నుంచి మూడు రోజులపాటు సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ ను విచారించబోతోంది. మూడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరుగుతుంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ హల్చల్
తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చెవిరెడ్డి ఆగ్రహం.
ఎవ్వరినీ వదలనంటూ హెచ్చరించిన చెవిరెడ్డి.
మూడు రోజులు విచారణ చేసేందుకు సిట్‌కు కోర్టు అనుమతి.
సిట్ అదుపులో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు. pic.twitter.com/I9e70HGJPK— ChotaNews App (@ChotaNewsApp) July 1, 2025