ఛత్రపతి శివాజీ వారసుడి కన్నుమూత

-

ఛత్రపతి శివాజీ మహారాజు 12వ తరం వారసుడైన ఛత్రపతి శివాజీరాజే భోసలే మంగళవారం పుణెలో తుది శ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యల వల్ల ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శివాజీరాజే మృతిపై ఆయన మేనల్లుడు, భాజపా రాజ్యసభ ఎంపీ ఉదయ్‌రాజ్ భోసలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మరణ వార్తను ట్విటర్​ ద్వారా తెలిపారు.

“శ్రీమంత్​ ఛత్రపతి శివాజీరాజే భోసలే, ఛత్రపతి వారసుడు, సతారా మాజీ మేయర్​ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని సతారాలోని అధాలత్​ వాడాలో అంతిమ దర్శనం కోసం బుధవారం ఉంచనున్నాం. గౌరవనీయులైన మామయ్యకు హృదయపూర్వక నివాళి” అని ట్వీట్​ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీరాజే భోసలే మృతికి సంతాపం తెలిపారు. సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. ఛత్రపతి శివాజీరాజే భోసలే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో కళలు, క్రీడలు, సాహిత్యం, సంస్కృతి, సమాజం లాంటి రంగాల్లో సేవలందించిన ఓ మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోయామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news