చికెన్ కేజీ 25…!

-

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలలో కోళ్ల పరిశ్రమకు మాత్రం చుక్కలు చూపించింది. చికెన్ తింటే కరోనా సోకుతుంది అనే పుకార్లు జనాల్లోకి బాగా వెళ్ళాయి. దీంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇది అబద్దం అని చెప్పడానికి ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఒక వేదిక పై చికెన్ లెగ్ పీస్ లు తిని మరి చూపించారు. అయిన కూడా జనాల్లో చికెన్ పట్ల ఉన్న అనుమానాలు పోలేదు.

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆదివారం చికెన్ షాపులు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్తితి పూర్తిగా మారి పోయింది. చికెన్ షాపులు మొహం చూసే నాథుడే కరువయ్యాడు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ కు పూర్తిగా దెబ్బతింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ షాపు వాళ్ళు అమ్మకాలు విన్నూత్న అమ్మకాలు మొదలెట్టారు.

రెండు కోళ్లు 100 రూపాయలు అని ప్రచారం చేస్తున్నారు. రెండు కోళ్లు అంటే దాదాపు 4 కిలోల మాంసం. కొందరు చికెన్ ప్రియులు ఈ ఆఫర్ ను అందుకోడానికి చికెన్ షాపు ముందు క్యూ కట్టారు. అయితే ఎంత క్యూ కట్టినప్పటికి గత అమ్మకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. కరోనా దెబ్బకు చికెన్ షాపు యజమానులు భారీగా నష్టపోయారు. ఇక పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news