కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (01-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగ‌ళ‌‌వారం (01-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 1st september 2020

1. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన క‌రోనా వ్యాక్సిన్‌కు గాను అమెరికాలో ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభించారు. మొత్తం 80కి పైగా ప్రాంతాల్లో 30వేల మంది వాలంటీర్ల‌కు ఆ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు.

2. క‌రోనా వ్యాపించ‌కుండా చూసేందుకు గాను మ‌నం ఉప‌యోగిస్తున్న అనేక హ్యాండ్ శానిటైజ‌ర్ల‌లో న‌కిలీవే ఉంటున్నాయ‌ని ఓ సంస్థ చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ముంబైలో 120కి పైగా వివిధ కంపెనీల‌కు చెందిన శానిటైజ‌ర్ల‌ను ప‌రీక్షించ‌గా వాటిల్లో 50 శాతం న‌కిలీవ‌ని తేల్చారు.

3. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,058 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,51,481కి చేరుకుంది. 2,54,626 మంది కోలుకున్నారు. 90,999 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,837 మంది చ‌నిపోయారు.

4. ఏపీలో కొత్త‌గా 10,368 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,45,139కి చేరుకుంది. 3,39,876 మంది కోలుకున్నారు. 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,053 మంది చ‌నిపోయారు.

5. ఢిలీల్లో కోవిడ్ పరిస్థితి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు మంగళవారం నుంచి 3వ‌ సెరోలాజికల్‌ (సెరో) సర్వే నిర్వ‌హిస్తున్నారు. వార్డు వారీగా సర్వే నిర్వహించ‌నున్నారు. మొత్తం 17వేల మందిని టెస్టు చేయ‌నున్నారు.

6. త‌మిళ‌నాడులో కొత్తగా 5,928 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,969కు చేరుకుంది. 7,418 మంది చ‌నిపోయారు. 3,74,172 కోలుకున్నారు. 52,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

7. ర‌ష్యాలో కొత్తగా 4,729 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,00,048కి చేరుకుంది. 8,15,705 మంది కోలుకున్నారు. 17,299 మంది చ‌నిపోయారు.

8. చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో మిగిలిన ఆట‌గాళ్లంద‌రికీ క‌రోనా టెస్టులు చేయ‌గా.. నెగెటివ్ వ‌చ్చింది. ఇప్ప‌టికే రుతురాజ్ గైక్వాడ్‌, దీప‌క్ చాహ‌ర్‌ల‌కు క‌రోనా రాగా టీంకు క‌రోనా టెస్టులు చేశారు.

9. దేశంలో కొత్త‌గా 69,921 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 36,91,166కు చేరుకుంది. 7,85,996 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 65,288 మంది చ‌నిపోయారు.

10. తెలంగాణ‌లో కొత్తగా 2,734 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం‌ కేసుల సంఖ్య 1,27,697కు చేరుకుంది. 836 మంది చ‌నిపోయారు. 95,162 మంది కోలుకున్నారు. 31,699 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news