విజయదశమి రోజున మన దేశంలో ఎన్నో పవిత్ర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు. ఆ రోజున ఏదైనా కార్యక్రమం చేపడితే మంచి జరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఆ రోజున చాలా కార్యక్రమాలు పెట్టుకుంటారు. తాజాగా కేరళలో సిఎం పినరాయి విజయన్ ఒక మంచి అడుగు వేసారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో తన డ్రైవర్ మనవరాలు దేవానాతో కలిసి ‘విద్యారంభం’ వేడుకను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ బాలికతో అక్షరాభ్యాసం చేయించారు సిఎం. కాగా ‘విద్యారంభం’ అనేది పిల్లలను స్కూల్ లో చేర్పించడానికి, వారికి చదువు నేర్పించడానికి మొదలుపెట్టే ఒక కార్యక్రమం. ఇది విజయ దశమి రోజున అక్కడ లాంచనంగా ప్రారంభిస్తారు.