ఉత్తర భారతదేశంలో ఏంటీ దారుణం… బీహార్, ఉత్తరప్రదేశ్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు…?

-

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో పిల్లలు కనపడకుండా పోతున్నారు. జనాభా పెరుగుదలలో ఉత్తర భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అనేది వాస్తవం. దేశ రాజధానికి దగ్గరగా ఉన్నా సరే… ఉత్తర భారత రాష్ట్రాల్లో జనాభా నానాటికి పెరిగిపోతుంది. దీనిపై ఎన్ని చర్యలు తీసుకున్నా జనంలో మాత్రం మార్పు రావడం లేదనేది వాస్తవం. అక్కడ ఎక్కువగా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు మగపిల్లలు కావాలని, మరికొంత మంది పిల్లలు ఉండటం పరువుగా భావించడం, మరి కొంత మంది పిల్లలను గర్వకారణంగా భావించడం,

మరికొంత మంది వంశాభివృద్ధి కోసం చూడటంతో జనాభా అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ అక్కడి ఆకలి కేకలు మాత్రం ఎవరికి వినపడటం లేదు. రాజకీయ పార్టీలు దేశ భక్తి, గుడులు, మతాల మీద పెట్టిన దృష్టి ఆకలి కేకల మీద పెట్టడం లేదు. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ఒక వార్త కలవరపెడుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పిల్లలు కనపడకుండా పోతున్నారు. దీనిపై జాతీయ మీడియాకు చెందిన కొందరు జర్నలిస్ట్ లు సర్వే చేయగా…

వాళ్ళు బెంగాల్ సరిహద్దుల నుంచి బంగ్లాదేశ్ కి, రాజస్థాన్ సరిహద్దుల నుంచి పాకిస్థాన్ కి వెళ్తున్నారట. అక్కడి నుంచి ఉగ్రవాద ముఠాలు వారిని తమ గ్రూపుల్లో చేర్చుకుంటున్నాయని తెలిసింది. పూట గడవని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, ఎక్కువగా ఈ వ్యవహారాలు సాగుతున్నాయని అంటున్నారు, తల్లి తండ్రులకు డబ్బులు ఇచ్చి వారిని కొనుక్కుంటున్నారట. ఆకలి కేకలతో పిల్లలను చంపడం ఎందుకని తల్లి తండ్రులు పంపిస్తున్నారట. వీటిల్లో కొంత మంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందనే విషయం బయటపడింది. కొందరు ప్రముఖుల అనుచరులు ఈ వ్యాపారాన్ని దగ్గర ఉండి నడిపిస్తున్నారనే సంచలన విషయాన్ని తెలుసుకున్నారు. దీనిపై ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాక్, సిరియా కూడా ఇక్కడి పిల్లలను తీసుకువెళ్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news