చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా ఒక్క కరోనా కేసు నమోదైనా… వెంటనే చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో కరోనా టెస్టులు పెంచడంతో పాటు పదుల సంఖ్యలో కేసులు నమోదు అయితే… లాక్ డౌన్ విధిస్తోంది. తాజాగా రెండేళ్ల గరిష్టస్థాయికి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. కొత్తగా 3400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు పట్టణాల్లో లాక్ డౌన్ విధిస్తోంది చైనా ప్రభుత్వం.
తాజాగా దక్షిణ చైనీస్ టెక్ హబ్ నగరం అయిన షెన్జెన్ లో ఆదివారం కొత్తగా 66 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ నగరవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం 1.7 కోట్ల జనాభా ఉన్న షెన్ జన్ నగరంలో ప్రస్తుతం లాక్ డౌన్ కిందికి వెళ్లింది. షెన్ జెన్ నగరంల హెువావే, టెన్సెంట్ వంటి టెక్ దిగ్గజాలకు నిలయం. ప్రభుత్వం కరోనాను పూర్తిగా తగ్గించడానికి ఇంట్లోనే ఉండాలని తెలిపింది.