చంద్రుడిపై మొక్కలను పెంచిన చైనా..!

-

చంద్రుడిపై శీతల వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి జీవి పెరిగే వాతావరణం లేనందున చెట్లు లేవనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటి అసాధ్యమైన పనిని కూడా చైనా సుసాధ్యం చేసింది. వాతావరణమే ఉండని చంద్రుడిపై మొక్కలు పెంచామని, తమ లూనార్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని చైనా వెల్లడించింది. అయితే ఈ విషయంపై కొందరు వ్యక్తులు.. ఏ పనినైనా చైనా చిటికెలో చేసేస్తుందని చెబుతుంటే.. మరికొందరు చైనా మాటలు, పనులు నమ్మడానికి వీల్లేదని, చంద్రుడిపై మొక్కలు పెంచిన విషయం కూడా అనుమానాస్పదమేనని చెప్పుకొచ్చారు.

 

మొక్కలు
మొక్కలు

 

కానీ, చైనా శాస్త్రవేత్తలు మాత్రం లూనార్ మిషన్‌లో పెంచిన మొక్కలను పెంచిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి తెగ సంబర పడుతోంది. అయితే వాతావరణమే లేని చంద్రుడిపై చైనా మొక్కలు ఎలా పెంచిందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, చైనా శాస్త్రవేత్తలు నేరుగా చంద్రుడిపై విత్తనాలు మొలకెత్తించలేదు. ఒక కంటైనర్‌లో మొక్క దశ నుంచి చెట్లు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను ఏర్పాటు చేసి.. కృత్రిమ వాతావరణ వ్యవస్థను కంటైనర్‌లో కల్పించారు. ఈ కంటైనర్‌ను లూనార్ ప్రోబ్‌తోపాటు చంద్రుడిపై పంపించారు. అలా చంద్రుడి ఉపరితలంపై కంటైనర్‌ను పంపించి మొక్కలు పెంచే విధానాన్ని అమలు చేసింది. కృత్రిమ వాతావరణ వ్యవస్థను కల్పించడంతో విత్తనాలు మొలకెత్తినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.

 

చంద్రుడిపై, అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో పెద్ద ముందడుగు. చైనా చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో చంద్రుడిపై ఒక బేస్‌ను నిర్మించే యోచనలో పడింది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా, కంటైనర్‌లో బ్యాటరీ సమస్య తలెత్తడంతో మొలకెత్తిన విత్తనాలు చంద్రుడిపై ఉండే తీవ్ర చలి వాతావరణానికి చనిపోయాయని, ఎదేమైనా కంటైనర్‌లో మొక్కలు పెంచగలిగామని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్‌లో చంద్రుడి వాతావరణానికి అనుకూలంగా బేస్‌ను ఏర్పాటు చేసి కంటైనర్లలో మొక్కలు పెంచుతామని చైనా శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. చంద్రుడిపై మొక్కలు పెంచడంపై చైనా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news