శానిటైజర్ వాడడం వల్ల చేతులు పొడిబారుతున్నాయా? ఐతే ఇది మీకోసమే.

-

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ప్రజలందరూ అత్యధికంగా వాడుతున్న వస్తువు ఏదైనా ఉందంటే అది మాస్క్, శానిటైజర్ అని చెప్పవచ్చు. మన దేశంలోఓ కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి మన చేతుల్లోనే ఉంది. కానీ ఎందుకైనా మంచిదన్నట్టుగా శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం చేస్తూనే ఉన్నాం. చేయాలి కూడా. కరోనా కొత్త రూపాలు బయటకు వస్తున్నాయని వినిపిస్తున్న సమయంలో ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.

ఐతే శానిటైజర్ వాడుతూ చేతులని శుభ్రపరుస్తూ ఉండడం వల్ల చేతులు పొడిబారుతున్న ఫీలింగ్ కలుగుతున్న మాట నిజమే. శానిటైజర్ లో ఉన్న లక్షణాలు చేతులు పొడిబారేలా చేస్తాయి. ఎక్కువసార్లు శానిటైజ్ చేస్తూ ఉండడం పొడిబారడానికి కారణం అవుతుంది. మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం.

చేతులకి మాస్క్ వేయాలి

ముఖానికి మాస్క్ ఎలా ధరిస్తున్నామో, చేతులకి కూడా మాస్క్ ధరించడం ముఖ్యం. శానిటైజేషన్ వల్ల చర్మానికి ఉన్న తేమ కోల్పోతుంది. అందుకని మాస్క్ ధరించి కాపాడుకోవడం ఉత్తమం. ముఖానికే కాదు చేతులకీ మాస్క్ అవసరం ఉందన్న సంగతి గుర్తుంచుకోండి. వైద్యశాలలో పని చేసే వారు మాత్రం తప్పకుండా ఇది పాటించాలి.

మానిక్యూర్

చేతుల అందాన్ని పెంచే మానిక్యూర్ పద్దతిని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. క్యూటికల్స్ పోషణ పెంచేందుకు క్యూటికల్ క్రీమ్ వాడాలి. చేతులకి పట్టిన దుమ్మును తొలగించడానికి, చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి కొత్తవి ఏర్పడేలా చేసుకోవాలి. చర్మం తేమను పెంచడానికి ప్రకృతి పరమైన పండ్లతో తయారు చేసిన లేదా బంకమట్టితో చేసిన ముసుగును ధరించాలి.

Read more RELATED
Recommended to you

Latest news