పాకిస్తాన్ ని బాగా వాడేస్తున్న చైనా… కాని చైనా చాలా వరస్ట్

-

పాకిస్తాన్ చైనా విధానానికి బంటుగా మారుతోందని, అమెరికా బలగాలు నిష్క్రమించిన తరువాత బీజింగ్ ఆఫ్ఘనిస్తాన్‌ లోకి ప్రవేశించవచ్చని భారత వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసారు. చైనా మీద ఉన్న ప్రపంచవ్యాప్త ఆకాంక్షలు మరియు మిలిటరీ ద్వారా ఆధిపత్యం గురించి మాట్లాడిన ఐఎఎఫ్ చీఫ్… బీజింగ్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

అమెరికా బలగాలు నిష్క్రమించిన తరువాత యుద్ధంలో దెబ్బతిన్న దేశంలోకి ప్రవేశించడానికి చైనా పాకిస్థాన్‌ ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. ప్రత్యక్షంగా పాకిస్తాన్ ద్వారా మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి వీలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం వారు చాలా కాలంగా చూస్తున్నారు అని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెంచుకోవడానికి చాలా కష్టపడుతుందని అన్నారు.

చైనా యొక్క ఆకాంక్షలు గ్లోబల్ ఫ్రంట్ లో ఉన్నాయని చెప్పారు. తీవ్రమైన చైనా-ఇండియా వివాదం గ్లోబల్ ఫ్రంట్‌ లో చైనాకు మంచిది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. వారి లక్ష్యానికి అనుగుణంగా పరిస్థితి లేదు అని అన్నారు. చైనాను అర్థం చేసుకోవడం, వారి ఆట ప్రణాళిక మరియు చైనా-పాక్ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడం ఒక ముఖ్యమైన జాతీయ భద్రతా సవాలు అని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ ఇప్పటికే పూర్తిగా నాశనం అయిందని, అక్కడ ఉన్న వనరులను చాలా ఎక్కువగా వాడుకునే ప్రయత్నాలు చైనా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news