కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇంకా భయం తొలగకముందే.. మంగోలియాలో ‘బుబోనిక్ ప్లేగు’ వైరస్ వెలుగులోకి వచ్చిందని చైనాలోని బయాన్నూర్ నగర అధికారులు హెచ్చరించారు. ఈ వైరస్ లక్షణాలైన జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. పందికొక్కు మాంసం తినడం వల్ల వీరికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు.
దీంతో అతనికి సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేశారు. ఈ వ్యాధి మానవుల నుంచి మానవులకు చాలా తొందరగా వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే, ఇది మరింత బలమైనదని చెబుతూ నగరంలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ సంవత్సరం చివరి వరకూ ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయని తెలిపారు.